: 31 నుంచి భవానీ దీక్షల విరమణ
ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవానీ భక్తులు లక్షలాది సంఖ్యలో వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘భవానీ’ల ఉచిత దర్శనం కోసం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని.. అంతరాలయ దర్శనానికి రూ. 200 టికెట్లు విక్రయిస్తున్నామని అన్నారు. గిరి ప్రదర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నర్సింగరావు చెప్పారు.