: భార్యను చంపించబోయి...అడ్డంగా బుక్కయ్యాడు
ఎవరికీ అనుమానం రాకుండా భార్యను చంపించాలని చూసిన వ్యక్తి అడ్డంగా బుక్కై కటకటాలు లెక్కిస్తున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఉత్తరాఖండ్ కి చెందిన యాసిర్ అనే వ్యక్తి భార్య బీమా డబ్బులపై ఆశపడ్డాడు. దీంతో భార్యను హత్య చేసేందుకు ఇద్దరు వ్యక్తులకు సుపారీ చెల్లించాడు. ప్లాన్ ప్రకారం భార్య, పిల్లలతో బంధువుల ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో వారిని దోపిడీ దొంగలు (సుపారీ కిల్లర్స్) అటకాయించారు. ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు తీసుకుని, తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపారు. అది గురి తప్పి యాసిర్ కు తగిలింది. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమికూడారు. దీంతో దోపిడీ దొంగలు కాళ్లకు బుద్ధి చెప్పారు. తుపాకీ కాల్పులపై సమాచారం ఆందుకున్న పోలీసులు యాసిర్ ను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు.