: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఇండియాలో రైల్వే బ్రిడ్జ్!
ప్రపంచంలో అత్యధికులకు ఉపాధిని కల్పిస్తున్న సంస్థగా, అత్యంత పొడవైన రైలు మార్గాలను నిర్వహిస్తున్న సంస్థగా నిలిచిన భారతీయ రైల్వే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. జమ్మూకాశ్మీర్ పరిధిలోని చీనాబ్ నదిపై ఓ వంతెనను నిర్మిస్తుండగా, ఇది ఈఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉండనుంది. మొత్తం 1.3 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి 359 మీటర్ల ఎత్తున ఉంటుంది. కాగా, ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లన్న సంగతి తెలిసిందే. అంటే ఈ బ్రిడ్జి ఈఫిల్ కన్నా మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రెండు కొండల మధ్య చీనాబ్ నది ప్రవహిస్తుండగా, కొండలను కలుపుతూ 480 మీటర్ల ఆర్చ్ నిర్మించి, దాని ఆధారంగా రైల్వే లైన్ ను నిర్మించనున్నట్టు అధికారులు వెల్లడించారు.