: ఎంపీల కోసం ఎలక్ట్రిక్ బస్సులు - ప్రారంభించిన ప్రధాని
పార్లమెంటు ఆవరణను పూర్తి కాలుష్య రహితంగా చేసే దిశగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిని ఎంపీల అవసరాల కోసం వాడనున్నట్టు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఎంపీలు తిరిగేందుకు వీటిని వినియోగించనున్నట్టు మోదీ వివరించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. కాలుష్య రహితంగా దేశ రాజధానిని మార్చే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.