: డీడీసీఏ ఆరోపణలపై లోక్ సభలో జైట్లీ వివరణ
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) స్కాంలో తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఇవాళ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా రూ.35 కోట్లు సేకరించామని, మైదానం నిర్మాణానికి బీసీసీఐ రూ.4 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో రూ.114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియం పునర్నిర్మాణం చేపట్టామని వివరించారు. అయితే కాంగ్రెస్ పాలనలోనే అధికంగా నిధులు ఖర్చయ్యాయన్న జైట్లీ, స్టేడియం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.