: ఆంధ్రప్రదేశ్ సీఐడీపై మండిపడ్డ హైకోర్టు


అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం తీరును న్యాయమూర్తులు తప్పుబట్టారు. ఇంతవరకూ అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు, సీఐడీ తీరుపై మండిపడింది. పోలీసు కేసు నమోదైనా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని, అరెస్టులు జరగకపోవడానికి కారణాలేంటని ప్రశ్నించింది. సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అడిగింది. ఈ మొత్తం వ్యవహారంలో తమకు కొన్ని అనుమానాలున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు డబ్బులను వెనక్కిప్పిస్తామని, ఆస్తుల వేలాన్ని రెండు వారాల్లోగా ప్రారంభించాలని ఆదేశిస్తూ, విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వేలం ప్రక్రియ మొదలు కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News