: శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తజనం పోటెత్తింది. ఈరోజు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవెంకటశ్వర స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 56,698 మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా అనేకమంది భక్తులు భారీ క్యూలైన్లలో బారులు తీరి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు కూడా తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.