: రూ. 5 వేల లోపు నుంచి రూ. 6 వేల వరకూ అందుబాటులోని 10 చౌక 4జీ స్మార్ట్ ఫోన్లివే!


3జీ ఫోన్ల విక్రయాలు 2015తో పాటే కాలగమనంలో కలిసి పోతాయా? అందుబాటులోకి వచ్చిన 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలను చూస్తుంటే, 2016 సంవత్సరం 4జీదే అనిపిస్తోంది. 2014లో 3జి ఫోన్లు లభించిన ధరల్లో ఇప్పుడు 4జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రూ. 5 వేల లోపు నుంచి రూ. 6 వేల వరకూ అందుబాటులోని 4జీ స్మార్ట్ ఫోన్ల వివరాలు పరిశీలిస్తే... 1. జడ్టీడీ బ్లేడ్ క్యూ లక్స్ - ధర: 4,299 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8/5 ఎంపీ కెమెరాలు, ఆండ్రాయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. 2. స్వైప్ ఎలైట్ 2 - ధర రూ. 4,545 4.5 అంగుళాల స్క్రీన్, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8/5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. అత్యాధునిక ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత. 3. ఫికామ్ క్లూ 630 - ధర రూ. 4,890 5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ సిస్టమ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1.1 జీహెచ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5/2 ఎంపీ కెమెరాలు, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 4. లెనోవో ఏ 2010 - ధర రూ. 4,999 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ 1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 5 ఎంపీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉంటాయి. 5. ఫికామ్ ఎనర్జీ 653 - ధర రూ. 4,999 ఈ జాబితాలో హెచ్డీ స్క్రీన్ తో లభించే అత్యంత చౌకయిన ఫోన్ ఇది. 5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ సిస్టమ్, 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ (స్నాప్ డ్రాగన్) ప్రాసెసర్, 1జీబీ రామ్ ఉన్న ఫోన్లో 8/2 ఎంపీ కెమెరాలు, 2,230 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 6. ఇన్ ఫోకస్ ఎం 370 - ధర రూ. 5,299 5 అంగుళాల స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8/2 ఎంపీ కెమెరాలు, ఆండ్రాయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. ఈ ఫోన్ 14 గంటల టాక్ టైం ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. 7. పానాసోనిక్ టీ 45 - ధర రూ. 5,365 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ 1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 ఎంపీ/వీజీఏ కెమెరాలు, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. 8. ఇన్ ఫోకస్ ఎం2 - ధర రూ. 5,499 ఇన్ ఫోకస్ తక్కువ ధరకు అందిస్తున్న మరో చౌక 4జీ ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ రామ్ ఉన్న ఫోన్ లో మెమొరీని 64 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. 9. జియోమీ రెడ్ మీ2 - ధర రూ. 5,999 జియోమీ అందిస్తున్న లోఎండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. 4.7 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1.2 జీహెచ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 జీబీ మెమొరీ, 8/2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. బ్యాటరీని వేగంగా చార్జింగ్ చేసేలా క్విక్ చార్జ్ 1.0 టెక్నాలజీ ఉండటం దీనికి అదనపు ఆకర్షణ. 10. మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ - ధర రూ. 5,999 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ 1.1 జీహెచ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5/2 ఎంపీ కెమెరాలు, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి.

  • Loading...

More Telugu News