: కాల్ మనీ వ్యవహారంలో మా పార్టీ నేతలెవరూ లేరు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
విజయవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంలో ఆరుగురు సీపీఎం నేతలున్నారంటూ ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల ఆ పార్టీ మండిపడుతోంది. ఈ వ్యవహారంలో తమ నేతలెవరూ లేరని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మీడియా సమావేశంలో చెప్పారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎంపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇక కాల్ మనీ విషయంపై ప్రతిపక్ష, అధికార పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకోవాలని మధు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని హితవు పలికారు.