: ప్రతిదానికీ సోనియా గాంధీనే బాధ్యత వహించాలా?...జైట్లీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి ఫైర్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోపమొచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ సర్కారు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మధ్య రాజుకున్న డీడీసీఎ వివాదంలో బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కీలక వ్యక్తిగా మారారు. దీనిని ఆధారంగా చేసుకుని నిన్న ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గాంధీపై అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీని కీర్తి ఆజాద్ కలిసిన తర్వాతే డీడీసీఏ కుంభకోణం తెరపైకి వచ్చిందని, ఈ కారణంగా ఈ దర్యాప్తునకు సోనియా గాంధీనే అంకురార్పణ చేశారని జైట్లీ ఆరోపించారు. నేటి ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సోనియా గాంధీ, జైట్లీ వ్యాఖ్యలపై కస్సుమన్నారు. ‘‘ప్రతి దానికీ సోనియా గాంధీనే బాధ్యత వహించాలా?’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.