: ఐఫోన్ 6 ఎస్, 6ఎస్ ప్లస్ ధరలు తగ్గించిన యాపిల్
దాదాపు రెండు నెలల క్రితం విడుదలైన యాపిల్ సరికొత్త ఫోన్లు 6ఎస్, 6ఎస్ ప్లస్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ఫోన్ల అమ్మకాలు దీపావళి తరువాత గణనీయంగా తగ్గడంతో 16 శాతం వరకూ ధరలను తగ్గించింది. అక్టోబర్ 16న మార్కెట్లోకి విడుదలైన రోజున ఐఫోన్ 6 ఎస్ లాంచింగ్ ధర రూ. 62 వేలు ఉండగా, దాన్ని ఎంచుకునే వేరియంట్ ను బట్టి 11 నుంచి 16 శాతం, అంటే రూ. 52 వేల నుంచి రూ. 55 వేల వరకూ ధరలను తగ్గించినట్టు, ఈ ఫోన్లను అమ్ముతున్న నాలుగు పెద్ద రిటైల్ కంపెనీలు వెల్లడించాయి. ఇక ఐఫోన్ 6 ఎస్ ధరలను 15 శాతం తగ్గించామని తెలిపాయి. కాగా, ఐఫోన్ వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసం అధికంగా ఉండటంతో, చాలా మంది అప్ గ్రేడ్ కావడానికి అయిష్టత చూపుతున్నందునే, యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఐఫోన్ 5 సిరీస్ ధరలను కూడా యాపిల్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ లో రూ. 24,999 నుంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.