: థెరెసా నాకు దైవంతో సమానం: గిరిజన మహిళ మోనికా బెస్రా


నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ చారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్ హుడ్ ప్రకటించడం పట్ల కోల్ కతా దినాజ్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా స్పందించారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరెసా తనకు దైవంతో సమానమని ఆమె అన్నారు. తన అద్భుతమైన శక్తితో కేన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని చెప్పారు. 1998 సెప్టెంబర్ 5 తనకు మరపురాని రాత్రి అని బెస్రా గుర్తి చేసుకున్నారు. ఆమెను చూస్తూ తెల్లని కాంతి కిరణాలు, అపురూపమైన వెలుగును దర్శించుకున్నానని పేర్కొన్నారు. ఆ తరువాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానని, మరుసటి ఉదయానికి భయంకరమైన కేన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా వివరించారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ కు సెయింట్ హుడ్ దక్కడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News