: కేజ్రీవాల్ పై రూ.10 కోట్ల పరువునష్టం దావా


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఆయనతో పాటు ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్ పేయిలపై వ్యక్తిగత హోదాలో జైట్లీ కేసు దాఖలు చేశారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై కేజ్రీ, జైట్లీల మధ్య ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీడీసీఏలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ కేజ్రీ చేసిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని జైట్లీ తన దావాలో పేర్కొన్నారు. కాగా, ఇదే విషయంలో పాటియాల హౌజ్ కోర్టులో జైట్లీ క్రిమినల్ కేసు కూడా దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News