: 'నిర్భయ' కేసులో మహిళా కమిషన్ పిటిషన్ కొట్టివేత
'నిర్భయ' కేసులో మైనర్ బాలుడు విడుదలను వ్యతిరేకిస్తూ అతడిని జైలులోనే ఉంచాలని ఢిల్లీ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దాదాపు అర్ధగంట పాటు ఈ అంశంపై జరిగిన వాదనల్లో, ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని, అతడి విడుదలపై స్టే విధించేందుకు తమ వద్ద చట్టపరమైన హక్కులు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. అనంతరం పిటిషన్ ను కొట్టివేసింది. మూడు సంవత్సరాల పాటు జువనైల్ హోమ్ లో ఉంచిన తరువాత నిన్న (ఆదివారం) విడుదల చేశారు. అతనిని విడుదల చేయడంపై పలువురి నుంచి వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 'నిర్భయ' తల్లిదండ్రులు కూడా మైనర్ బాలుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల నేరస్తుడికి ప్రయాదం ఉందన్న కారణాలతో స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉంచారు.