: కేటీఆర్ మెట్రో రైల్లో ఎందుకు ప్రయాణించారంటే... వివరించిన షబ్బీర్ అలీ


మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సహచర మంత్రులతో కలసి మెట్రో రైలు ట్రయల్ రన్ లో పాల్గొనడం తెలిసిందే. దీనిపై తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే కేటీఆర్ మెట్రో రైలు ఎక్కారని అన్నారు. టీఆర్ఎస్ నిర్వాకం వల్ల మెట్రో రైలు నిర్మాణం ఏడాది ఆలస్యం అయ్యే పరిస్థితులు తలెత్తాయని, రూ. 2100 కోట్ల అదనపు భారం పడిందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో, ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ మెట్రో యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ల వద్ద మెట్రో రూట్ మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేశారని, ఆయన వల్లే మెట్రో నిర్మాణం ఆలస్యమయిందని మండిపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పారు.

  • Loading...

More Telugu News