: విపక్షం లేక చప్పగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ!


ప్రజా సమస్యలను చర్చించి, వాటికి పరిష్కరాలు కనుగొనే వేదికగా అసెంబ్లీ నిలుస్తుందన్నది అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఏదైనా కీలక అంశం లేక మరేదైనా ముఖ్యమైన విషయం ప్రస్తావనకు రావాలంటే, అది ప్రతిపక్షాల నుంచే వస్తుంది. అధికార పక్షం ఎలాగూ తమకు ఇబ్బందులు కలిగించే అంశాల జోలికి వెళ్లవు కాబట్టి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ మద్దతుతో అధికార పక్షంగా తెలుగుదేశం, విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండగా, నేడు వైకాపా సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ, బయటకు వెళ్లిపోయింది. ఆపై సభను కొనసాగిస్తుండగా, పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం లాబీల్లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ లోపల బోసిపోయినట్టుండగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. ఏ అంశమైనా విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రశ్నలు లేకుంటే సరైన తుది నిర్ణయం రావడం కష్టమే. ఇక విపక్షమే లేకుంటే... ఏపీ అసెంబ్లీలో ఇప్పుడదే పరిస్థితి. విపక్షం లేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు లేక, సభ చప్పగా సాగుతోంది. అంతకుముందు వైకాపా సభ్యురాలు రోజా సస్పెన్షన్ ను తక్షణం ఎత్తివేయాలని కోరగా, ప్రభుత్వం అంగీకరించక పోవడంతో సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన వైకాపా నేత వైఎస్ జగన్, తన ఎమ్మెల్యలతో కలసి బయటకు వెళ్లిపోయారు. ఏపీ అసెంబ్లీ జరుగుతుంటే, ఎప్పటికప్పుడు లైవ్ అందించే పలు టీవీ చానళ్లు సైతం, వైకాపా వెళ్లిపోయిన అనంతరం, అసెంబ్లీ లైవ్ ఆపివేసి, ఇతర వార్తలను, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల రద్దీ న్యూస్ నూ చూపుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News