: షారూక్... నటించడం ఎప్పుడు నేర్చుకుంటావు?: ఓ అభిమాని ప్రశ్నకు సమాధానం ఇదే


బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, తన ట్విట్టర్ ఖాతా దార్వా అభిమానులతో లైవ్ చాటింగ్ లో ఉన్న వేళ, ఓ అభిమాని నుంచి చిత్రమైన ప్రశ్న ఎదురైంది. సుమీత్ భాటియా అనే అభిమాని "నటించడం ఎప్పుడు నేర్చుకుంటావు?" అని ప్రశ్నించగా, దానికి షారూఖ్ స్పందించారు. ప్రశ్న అడిగిన 17 నిమిషాల తరువాత సమాధానం ఇస్తూ, "మరణించేదాకా నటించడాన్ని ఎవరూ నేర్చుకోలేరు. అదేమీ కూడికలు, తీసివేతల సూత్రం కాదు" అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. కాగా, షారూక్, కాజోల్ నటించిన తాజా చిత్రం 'దిల్ వాలే' బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News