: తిరుమలలో భక్తులను తుపాకీతో బెదిరించిన ఎస్సై... ఉద్రిక్తత!


చిన్న సమాచారం అడిగినందుకు, ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎస్సై, తన సర్వీస్ రివాల్వర్ ను బయటకు తీసి కాల్చివేస్తానని భక్తులను బెదిరించాడు. ఈ ఘటన తిరుమలలో జరుగగా, భక్తులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల చేరుకున్నారు. జేఈఓ కార్యాలయానికి దారి తెలియక, పక్కనే డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగేశ్వర్ ను సమాచారం అడిగారు. ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో... ఆ ఎస్సై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తుపాకీతో బెదిరించాడు. అతని చర్యలను నిరసిస్తూ, భక్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు భక్తులకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News