: అసెంబ్లీలో అరుదైన దృశ్యం... జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభా నాయకుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సభ లోపలికి జగన్ రాగానే, ఆయన సీటు వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయనతో కరచాలనం చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. చంద్రబాబు వెంటే వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వద్దకు వచ్చి మరీ బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు, ఇతరులతో జగన్ ఆత్మీయ కరచాలనం చేశారు.