: వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తజనం... ప్రముఖులతో కిటకిటలాడుతున్న తిరుమల
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. నిన్నటి నుంచి ప్రారంభమైన భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా వెంకన్న దర్శనానికి క్యూ కట్టారు. ప్రస్తుతం తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భక్తుల తాకిడిని ముందే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈఓ సాంబశివరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. భక్తుల్లో కలిసిపోయిన ఆయన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది.