: ‘అక్కినేని ఫౌండేషన్’ పురస్కారాలు...కైకాల సత్యనారాయణకు సినీ రత్న పురస్కారం
ప్రముఖు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ‘అక్కినేని ఫౌండేషన్’ సినీ రత్న పురస్కారాన్ని అందజేసింది. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాల వేడుక హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుమార్తె నాగ సుశీల, మనవళ్లు సుమంత్, సుశాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాలను పలువురికి అందజేశారు. అలనాటి అందాల తార జమునకు అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ పురస్కారాన్ని అందజేశారు.