: అమరావతిలో పండగ వాతావరణం!


ప్రముఖ హీరో బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న 'డిక్టేటర్' చిత్రం ఆడియో రిలీజ్ వేడుక కార్యక్రమం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభం కానుంది. ఈ ప్రాంతంలో తొలిసారిగా జరుగుతున్న ఆడియో వేడుక కావడంతో దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు బాలయ్య అభిమానులు ఇప్పటికే భారీగా తరలివచ్చారు. అభిమానుల సందడితో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మరోపక్క, 99 బైక్ లతో హైదరాబాద్ నుంచి అభిమానులు ర్యాలీగా వస్తున్నారు. వాటి వెంటే రెండు బస్సుల్లో చిత్ర యూనిట్ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో ఈ ర్యాలీతో మరికొన్ని వాహనాలు, బైక్ లు కలిశాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా పెదకూరపాడుకు సమీపంలో ఈ చిత్ర యూనిట్ బస్సులు ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News