: మిర్యాలగూడలో బాలయ్య ...అభిమానుల సందడి!


బాలయ్య అభిమానులు మిర్యాలగూడలో సందడి చేశారు. 'డిక్టేటర్' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి వెళుతున్న ఆ చిత్ర యూనిట్ కు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో బాలకృష్ణ అభిమానులు వారి వాహనాన్ని ఆపారు. బస్సులో నుంచి కిందకు దిగివచ్చిన బాలయ్యను పూలమాలలతో అభిమానులు సత్కరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో రిలీజ్ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది.

  • Loading...

More Telugu News