: నకిలీ నూడుల్స్ కేంద్రంపై పోలీసుల దాడి!


హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని నకిలీ నూడుల్స్ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 700 కిలోల నకిలీ నూడుల్స్, 70 బస్తాల మైదాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్ మహా నగరంలో నకిలీ ఉత్పత్తులు ఎక్కువై పోయాయి. నకిలీ నూనెలు, మసాలాలు, పచ్చళ్లు, నెయ్యి మొదలైన ఉత్పత్తులను తయారు చేస్తున్న ముఠాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ ఉత్పత్తిదారులను కఠినంగా శిక్షించాలంటూ ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News