: రంగనాథ్ ఆఖరి మెస్సేజ్ ‘గుడ్ బై’!
ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు వాట్సప్ ద్వారా ఒక అసోసియేషన్ కు సందేశాలు పంపారు. సదరు అసోసియేషన్ రంగనాథ్ ని ఘనంగా సత్కరించాలనుకుంది. ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో సదరు సంస్థ ‘మీ కోసం ఎదురు చూస్తున్నాము’ అంటూ రంగనాథ్ కి మెస్సేజ్ పంపింది. దీనికి ఆయన స్పందిస్తూ..‘ సార్, ఈ కార్యక్రమానికి నేను రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ఈ కార్యక్రమం బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను’...‘గుడ్ బై’ అంటూ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.