: రంగనాథ్ చితికి నిప్పంటించిన తనయుడు!
ప్రముఖ నటుడు రంగనాథ్ కు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో రంగనాథ్ అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు నాగేంద్ర తండ్రి చితికి నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి తరలివెళ్లారు. రంగనాథ్ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతిపై తోటి నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురికి ధైర్యం చెప్పే వ్యక్తి ఈవిధంగా ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అంటూ, పలువురు నటులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.