: నర్సు చేజారి కిందపడ్డ శిశువు!
నర్సు కంగారుకు ఆసుపత్రిలో ఓ శిశువు బలైంది. ఆసుపత్రిలో శిశువు బెడ్ ను మారుస్తుండగా మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఎంవై ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పసికందు ఉన్న బెడ్ ను మార్చుతుండగా, నర్సు చేతిలో నుంచి శిశువు కిందపడిపోయాడు. వెంటనే శిశువును వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే శిశువు ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో శిశువు తల్లి గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏడీ భట్నాగర్ మాట్లాడుతూ, అజాగ్రత్తగా వ్యవహరించినందుకు నర్సుపై చర్యలు తీసుకుంటామని అన్నారు.