: టీమిండియాలోకి వాళ్లిద్దరూ రావడంపై సచిన్ సంతోషం!


టీమిండియాలోకి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాలు తిరిగి రావడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో భారత్-ఆస్ట్రేలియా టీ-20 సిరీస్ జరగనుంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ సిరీస్ లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు యూవీ, నెహ్రాలను జట్టులోని తిరిగి తీసుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, యూవీ, నెహ్రా అకుంఠిత దీక్షకు... వాళ్లిద్దరూ జట్టులోకి తిరిగి రావడమే నిదర్శనమన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత్ జట్టుకు విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని సచిన్ కోరుకున్నాడు.

  • Loading...

More Telugu News