: ఈరోజు సాయంత్రం రంగనాథ్ అంత్యక్రియలు
ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. హైదరాబాదు, బన్సీలాల్ పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రంగనాథ్ కుటుంబసభ్యులు తెలిపారు. రంగనాథ్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. కాగా, పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.