: అమెరికా సంస్థకు విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు పగ్గాలు!


సుమారు రూ. 670 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు తలపెట్టిన విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు బాధ్యతలను యూఎస్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ బ్రూక్ ఫీల్డ్ కు అప్పగిస్తూ నిర్ణయం వెలువడింది. రింగు రోడ్డుకు శంకుస్థాపన కూడా జరగక ముందే 99 శాతం భూ సేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టును తొలుత గామన్ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. పనులు మొదలు పెట్టేందుకు మూడేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్న ఆ సంస్థపై కేంద్రం వేటు వేయడంతో, బ్రూక్ ఫీల్డ్ తెరపైకి వచ్చింది. కాగా, ఈ ప్రాజెక్టులో బ్రూక్ ఫీల్డ్ 100 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వాస్తవానికి 2017 నాటికే ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావాల్సి వుండగా, ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఇక బ్రూక్ ఫీల్డ్, ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తామన్న విషయాన్ని, ఎప్పటికి పూర్తవుతుందన్న అంచనాలను ఏపీ సర్కారుకు వెల్లడించాల్సి వుంది.

  • Loading...

More Telugu News