: రోజా సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమే... నాటి బలరాం సస్పెన్షన్ తో పోలిక లేదు: మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి
వైకాపా శాసన సభ్యురాలు రోజా సస్పెన్షన్ నిబంధనలకు అనుగుణంగానే జరిగినప్పటికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మాత్రం విరుద్ధమేనని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను స్పీకర్ గా ఉన్నప్పటి సమయంలో చేబట్టిన కరణం బలరాం సస్పెన్షన్ కు, తాజాగా జరిగిన రోజా సస్పెషన్ కు సంబంధం లేదని అన్నారు. ఆనాడు బలరాం స్పీకర్ పై సభ వెలుపల వ్యాఖ్యలు చేశారని, తనపై అభియోగాలకు స్పీకర్ సమాధానం చెప్పుకోలేడు కాబట్టి, అది తీవ్రమైన అంశమేనని అన్నారు. అప్పట్లో ఎథిక్స్ కమిటీ అన్ని విషయాలనూ పరిశీలించిన మీదటే, బలరాం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేసుకున్నారు. నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ, సభా నిర్ణయమే ఫైనల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.