: ఆత్మహత్య చేసుకున్నది 'ఆట' భరత్... ఆర్థిక ఇబ్బందులే కారణం!
బుల్లితెర ప్రోగ్రామ్ ప్రెజంటర్ ఓంకార్ రూపొందించిన 'ఆట' డ్యాన్స్ ప్రోగ్రామ్ లలో లక్షలాది మందిని మెప్పించిన భరత్ ఆత్మహత్య చేసుకోవడం పలువురు టీవీ అభిమానుల్లో, సాటి కళాకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు రాగానే, ఏ భరత్? అంటూ పలువురు ఆరా తీయగా, 'ఆట' ప్రోగ్రామ్ ద్వారా బొద్దుగా ఉండే శ్రీవిద్యతో కలసి నృత్యాలు చేస్తూ అందరినీ ఆకర్షించి, పలు బహుమతులు కొట్టేసిన భరత్ అని స్పష్టమై, దిగ్భ్రాంతి చెందారు. భరత్ ను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని, టీవీ షోలు తగ్గడంతో టూ బెడ్ రూం హౌస్ నుంచి చిన్న ఇంటికి మారాల్సి వచ్చిందని తెలుస్తోంది. గత కొంత కాలంగా చిన్నారులకు డ్యాన్స్ నేర్పుతూ కాలం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో భరత్, ఈ ఉదయం ఉరి వేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు దారితీసిన మరిన్ని కారణాల కోసం దర్యాఫ్తు చేస్తున్నారు.