: 43 ఏళ్ల తరువాత ఇరాక్ లో ఓ బ్యూటీ క్వీన్!
అది అందాల భామను ఎంపిక చేసేందుకు జరుగుతున్న పోటీ. సాధారణంగా ఇటువంటి పోటీల్లో ఆహూతులకు మద్యం సరఫరా అవుతుంటుంది. గుప్పున పొగ వదులుతూ, పొగరాయుళ్లు అందాలను ఆస్వాదిస్తుంటారు. అందాల భామల మధ్య స్విమ్ సూట్ పోటీ మరింత మత్తెక్కిస్తుంది. కానీ, ఇరాక్ లో పరిస్థితి వేరు. ఇటువంటివి ఏమీ లేవు. అసలా దేశంలో 1972 తరువాత అందాల పోటీలే జరగలేదు. కానీ, ఈ సంవత్సరం ఆ దేశానికి కొత్త బ్యూటీ క్వీన్ పరిచయమైంది. గత రాత్రి జరిగిన పోటీల్లో కిర్కుక్ నగరానికి చెందిన షైమా అబ్దెల్ రెహ్మాన్ విజయం సాధించింది. బాగ్దాద్ లోని ఓ హోటల్ బాల్ రూంలో జరిగిన పోటీని తిలకించిన వారంతా, తమ దేశం మారిందని సంబరాలు చేసుకున్నారు. 43 ఏళ్ల తరువాత ఇరాక్ లో జరిగిన అందాల పోటీల్లో, 20 ఏళ్ల పచ్చకళ్ల షైమా మిగతావారందరినీ వెనక్కు నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది.