: అత్యంత ఆప్తుడు దూరం కావడం నాకో షాక్: చిరంజీవి
తనకు అత్యంత ఆప్తుడైన రంగనాథ్ దూరం కావడం ఎంతో షాక్ ను కలిగించిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం రంగనాథ్ బౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన చిరంజీవి, అనంతరం మీడియాతో మాట్లాడారు. తన కెరీర్ ప్రారంభంలో రంగనాథ్ ఎన్నో సలహాలు అందించారని గుర్తు చేసుకున్నారు. 1979లో 'లవ్ ఇన్ సింగపూర్' సినిమాలో ఆయన హీరో అయితే, తాను సెకండ్ హీరో పాత్ర చేశానని, ఇద్దరమూ కలసి సింగపూర్ లో నెల రోజుల పాటు గడిపామని అన్నారు. ఇటీవల ఏడిద నాగేశ్వరరావు మరణించినప్పుడు, రంగనాథ్ ను కలిసి, గంటన్నరకు పైగా మాట్లాడానని తెలిపారు. అప్పుడు కూడా ఎంతో బలంగా ఉన్నట్టు కనిపించాడని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని అంగీకరించేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదని అన్నారు. ఆయనతో తనకెంతో సత్సంబంధాలున్నాయని వివరించారు. ఆయనతో గడుపుతుంటే సమయం తెలిసేది కాదని, రంగనాథ్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని అన్నారు.