: మల్టీ నేషనల్ కంపెనీల్లో మరో తెలుగోడి సత్తా... మైలాన్ సీఐఓగా రాయపురెడ్డి రామ్ కుమార్


మల్టీ నేషనల్ కంపెనీల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించిన వారి జాబితాలో మరో తెలుగుతేజం చేరాడు. ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ మైలాన్ సీఐఓ (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)గా రాయపురెడ్డి రామ్ కుమార్ ను నియమించినట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. కాగా, రామ్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా బానాపురంలో జన్మించారు. కాకినాడలో ఇంజనీరింగ్ చదివిన రామ్, ఆపై యూఎస్ లోని నార్త్ కరోలినా వర్శిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేసి, రాన్ బాక్సీ సంస్థలో సీఐఓగా విధులు నిర్వహించారు. దాదాపు 22 ఏళ్ల నుంచి డ్రగ్స్ రంగంలో రాణిస్తున్న రామ్, గత సంవత్సరంలో మైలాన్ లో చేరారు. ఇప్పుడాయనకు సంస్థ ఐటీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ, సీఐఓ పోస్టు లభించింది.

  • Loading...

More Telugu News