: రెండు రౌండ్లలోనే ప్రత్యర్థిని మట్టికరిపించి హ్యాట్రిక్ సాధించిన విజేందర్
వారం రోజుల క్రితం గాయాలతో ఇండియాకు పంపిస్తానని తనను హెచ్చరించిన బల్గేరియన్ బాక్సర్ సామెట్ హుసినోవ్ ను విజేందర్ సింగ్ మట్టి కరిపించాడు. ఆరు రౌండ్లు సాగాల్సిన పోటీలో రెండు రౌండ్లలోనే ప్రత్యర్థిని నాకౌట్ చేసి ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని బాక్సింగ్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. తొలి రౌండులో 3-0 ఆధిక్యాన్ని సాధించిన విజేందర్, రెండో రౌండ్ పోరు ప్రారంభమైన 30 సెకన్లలోనే సామెట్ ను నాకౌట్ చేశాడు. విజేందర్ కుడిచేయి వేగంగా వెళ్లి సామెట్ ముఖాన్ని తాకగా, కిందపడిపోయిన అతనిక లేవలేదు. ఈ విజయం తదుపరి ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించగలనన్న నమ్మకాన్ని పెంచిందని పోటీ అనంతరం విజేందర్ వ్యాఖ్యానించాడు.