: ఇక బస్సులు, లారీల్లో డ్రైవర్ కు 'ఏసీ క్యాబిన్' తప్పనిసరి!


దేశంలో రహదారి ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. అన్ని రకాల బస్సులు, లారీల్లో డ్రైవర్లకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ, నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. 'ఇండియన్ రోడ్ కాంగ్రెస్'లో ప్రసంగించిన గడ్కరీ ఈ విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. "ప్రతి సంవత్సరమూ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల కారణంగా 1.5 లక్షల మంది చనిపోతున్నారు. మరో 3 లక్షల మందికి పైగా గాయపడుతున్నారు. వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలన్నది మా అభిమతం. డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి చేస్తే, వారిపై ఒత్తిడి తగ్గి, తద్వారా యాక్సిడెంట్లూ తగ్గుతాయని భావిస్తున్నాం. ఈ నిర్ణయం అమలైతే, ప్రతియేటా జరిగే 5 లక్షల ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గుతుందని అనుకుంటున్నాం" అని గడ్కరీ వివరించారు.

  • Loading...

More Telugu News