: యాగం జరిగే చోట పాలరాతి చండీ ఆలయం: కేసీఆర్ నిర్ణయం
అయుత చండీయాగంతో పవిత్రంగా మారే యాగ స్థలంలో పాలరాతితో భారీ చండీమాత ఆలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా తన ఫాంహౌస్ పరిధిలోనే ఆలయాన్ని నిర్మించాలని, దీంతో రెండు వందల సంవత్సరాల తరువాత వ్యక్తిగత హోదాలో జరుగుతున్న ఈ అయుత చండీయాగం కలకాలం ప్రజలకు గుర్తుండి పోతుందన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. కాగా, 2011లో శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సందర్భంగా పీఠం వారు ఈ యాగాన్ని చేయగా, ప్రైవేటు వ్యక్తులెవరూ దీన్ని నిర్వహించలేదు. యాగానికి నిధుల కొరత అన్న మాటే తలెత్తదని, దీన్ని చేసేందుకు పూనుకున్న వారు మాత్రం కఠోర నియమనిష్టలను పాటించాల్సి వుందని నిర్వాహకులు వెల్లడించారు.