: ఐఎస్ఐఎస్ కు ఢిల్లీ కంపెనీ నిధుల మళ్లింపు.... అతిపెద్ద హ్యాకింగ్!


ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి లండన్ క్లయింట్ నుంచి వస్తున్న నిధులను ఐఎస్ఐఎస్ హాకర్లు తమ ఖాతాలకు మళ్లించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం రూ.5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకూ నిధులు మళ్లివుంటాయని, ఈ సంవత్సరం ఇండియాలో ఐఎస్ఐఎస్ హాకింగ్ లో ఇదే అతిపెద్ద కేసని ఢిల్లీ పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ డబ్బంతా టర్కీలోని ఖాతాలకు వెళ్లిందని పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ఈ కేసు కోసం స్పెషల్ టీమును ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి విచారణ తొలి దశలోనే ఉందని తెలిపారు. ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్న టర్కీ హాకర్లు ఈ పని చేసి వుండవచ్చని వెల్లడించారు. సంస్థలోని ఓ ఉద్యోగి ఈమెయిల్ ఖాతాను హాక్ చేసిన హాకర్లు, ఆపై అందులోని సమాచారంతో తమ ఖాతాల్లోకి డబ్బు మళ్లించుకోగలిగారని తెలిపారు.

  • Loading...

More Telugu News