: అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు... డీసీడబ్ల్యూ సీరియస్


అరవింద్ కేజ్రీవాల్ ను విమర్శించేందుకు, ఆయన కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో వ్యక్తి. నిర్భయ కేసులో బాల నేరస్తుడిని విడుదల చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా, తన అభిప్రాయాన్ని తెలుపుతూ, గ్యారీ సింగ్ "ఎవరైనా 17, 18 ఏళ్ల యువకుడు కేజ్రీవాల్ కుమార్తెపై అత్యాచారం చేస్తే, రూ. 1 లక్ష, సరికొత్త బైక్ బహుమతిగా ఇస్తా" అని ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది. ఈ ట్వీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీడబ్ల్యూ సభ్యురాలు ప్రొమిల్లా గుప్తా వెల్లడించారు. కాగా, తన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారాన్ని తెలుసుకున్న గ్యారీ, దాన్ని డిలీట్ చేసినప్పటికీ, అతనిపై కేసు, విచారణ తప్పేలా లేవు.

  • Loading...

More Telugu News