: 'అఖిల్' సినిమా డిస్ట్రిబ్యూటర్లను నష్టాలపాలు చేసింది... బాధ్యత నాదే!: సినీ దర్శకుడు వీవీ వినాయక్
నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా, తాను దర్శకత్వం వహించిన 'అఖిల్' చిత్రం డిస్ట్రిబ్యూటర్లను నష్టాలపాలు చేసిందని దర్శకుడు వీవీ వినాయక్ వ్యాఖ్యానించాడు. చిత్రం పరాజయం పట్ల 'సారీ' చెప్పాడు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, అందుకు పూర్తి బాధ్యత తనదేనని అన్నాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఏలూరు వచ్చిన వినాయక్, నిర్మాత అంబికా కృష్ణతో కలసి మీడియాతో కాసేపు ముచ్చటించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలవుతుందని దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టం చేశాడు.