: ఈ ఏటి మిస్ వరల్డ్ గా స్పెయిన్ అందాల సుందరి


2015 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ గా స్పెయిన్ కు చెందిన అందాల భామ మిరియా లలాగునా రొయో ఎంపికైంది. మొత్తం 114 దేశాలకు చెందిన ముద్దుగుమ్మల నుంచి అత్యంత అందగత్తెగా మిరియా నిలిచారు. రష్యాకు చెందిన సోఫియా నికిచుక్ ఫస్ట్ రన్నరప్ గా, ఇండొనేషియా భామ మారియా హర్ ఫాంటీ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. వాస్తవానికి కెనడాకు చెందిన అనస్థిసియా లిన్ ఈ పోటీల్లో విజయం సాధిస్తారని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, చైనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఆమెకు, ఆ దేశ ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో, పోటీల్లో ఆమె పాల్గొనలేదు.

  • Loading...

More Telugu News