: పని మనిషి మీనాక్షికి రెండు లక్షలు ఇవ్వండి: రంగనాథ్ చివరి కోరిక


ప్రముఖ నటుడు రంగనాథ్ చివరి క్షణాల్లో కూడా తన బాధ్యతను మరువలేదు. ఆత్మహత్యకు ముందు ఆయనకు సన్మానం చేస్తామన్న వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పి, గుడ్ బై సార్ అని మెసేజ్ పెట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. రంగనాథ్ గొప్పతనాన్ని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తలచుకుని సినీ నటులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఆయన, తన ఇంట్లోని దేవుడి గదిలో దేవుడి పటాలపై డెస్టినీ అని రాశారు. అలాగే దాని ఎదురుగా గోడపై, ఇంటి పని మనిషి మీనాక్షికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని, ఆమెను ఇబ్బంది పెట్టవద్దని, ఆ రెండు లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బులు తన బ్యాంకు అకౌంట్ లో ఉన్నాయని, వాటి బాండ్లు తన బీరువాలో ఉన్నాయని, వాటిని అమెకు అందజేయాలని ఆయన రాశారు. ఇది చూసిన సినీ నటులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. చివరి క్షణాల్లో కూడా ఆయన తన ధర్మాన్ని మర్చిపోలేదని, ఆయనంత ఆదర్శమూర్తి ఉండరని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News