: 191 కోట్లు భరణంగా భార్యకు చెల్లించిన భర్త


న్యూజిలాండ్ లో అత్యంత ఖరీదైన విడాకులు జరిగాయి. మార్క్ క్లేటన్ అనే వ్యాపారి మిలానీ అనే మహిళను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అనంతరం వివిధ కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఈ సందర్భంగా మిలానీ తన ఇంటి పత్రాలను మాత్రమే తన వెంట తీసుకెళ్లింది. అయితే భర్త ఆస్తిలో భార్యకు భాగం ఉంటుందని భావించిన మిలానీ తన వాటా కోసం స్థానిక ఫ్యామిలీ న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. ఇది హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో రాజీకి వచ్చిన క్లేటన్, కోర్టు బయట వివాదం పరిష్కరించుకున్నారు. దీంతో తన భార్యకు 28.83 మిలియన్ డాలర్లను భరణంగా చెల్లించేందుకు అంగీకరించాడు. ఇది భారత కరెన్సీలో 191 కోట్ల రూపాయలు. దీంతో ఇది ఖరీదైన విడాకులుగా పేరొందింది.

  • Loading...

More Telugu News