: 560 సినిమాల్లో నటించి, 60 సినిమాలు తీశానంటే అది ప్రేక్షకుల అభిమానమే: మోహన్ బాబు
శ్రీకాళహస్తి దగ్గర ఉన్న చిన్న పల్లెటూర్లో పుట్టి తిరుపతి వచ్చి, రెండు జతల బట్టలతో మెట్రిక్ వరకు చదివి ఏదైనా సాధించాలని చెన్నై వెళ్లానని మోహన్ బాబు తెలిపారు. తొలి నాళ్లలో రాయలసీమ వాడివి నీకు భాష ఏమి వస్తుంది? అని అంతా అన్నారని, అలాంటి వారితోనే భాషలో మేటి అని నిరూపించుకోగలిగానని మోహన్ బాబు చెప్పారు. మామ మంచు-అల్లుడు కంచు సినిమా ఆడియో విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ, ఇది మరాఠీ సినిమా అని, ఈ కథకు సరైన నటుడు అల్లరి నరేష్ దొరికాడని, తామిద్దరం పోటీ పడి నటించామని ఆయన చెప్పారు. 560 సినిమాల్లో నటించి, 60 సినిమాలు నిర్మించానంటే దానికి కారణం తెలుగు సీని ప్రేక్షకుల అభిమానమేనని ఆయన తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.