: చివరి మూడు రోజుల్లో మూడు కీలక బిల్లులు తీసుకొస్తాం: అరుణ్ జైట్లీ
పార్లమెంటు సమావేశాల చివరి మూడు రోజులు మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదానికి అనువైన పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అయితే ప్రధాన సంస్కరణల బిల్లులను మాత్రం తప్పక పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. దేశంలో ఏకసభ్య న్యాయస్థానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మధ్యవర్తిత్వం, దివాళా సంస్థల కోసం కొత్త బిల్లును తీసుకురానున్నామని ఆయన తెలిపారు. కాగా, పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.