: ఈ ఏడాది వసూళ్లలో ఆ ఐదు సినిమాలే టాప్: తరణ్ ఆదర్శ్


ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన ఐదు సినిమాల గురించి సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వివరించారు. విడుదల రోజు భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలుగా సల్మాన్ నటించిన రెండు సినిమాలు నిలిచాయని ఆయన పేర్కొన్నారు. 40.35 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో సల్మాన్ నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా అగ్రస్థానం సాధించిందని ఆయన చెప్పారు. ద్వితీయ స్థానంలో కూడా సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా నిలిచిందని, ఆ సినిమా 27.25 కోట్ల ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిందని వెల్లడించారు. తరువాతి స్థానంలో రెండు రోజుల ముందు విడుదలైన షారూఖ్ ఖాన్ భారీ బడ్జెట్ సినిమా 'దిల్ వాలే' ఫస్ట్ డే 21 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో అక్షయ్ కుమార్ నటించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్', 'బ్రదర్స్' సినిమాలు నిలిచాయని ఆయన చెప్పారు. 'సింగ్ ఈజ్ బ్లింగ్' 20.67 కోట్లు వసూలు చేయగా, 'బ్రదర్స్' సినిమా తొలి రోజు 15.27 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News