: ఎల్లుండి అసెంబ్లీలో ప్రైవేటు వర్సిటీల బిల్లు ప్రవేశపెడుతున్నాం: మంత్రి గంటా


ఈ నెల 21న ఏపీ శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఏపీ చాంబర్ ఆఫర్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ వీసీల సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. అన్ని వర్సిటీల్లో ఒకే విధానం కోసం ఈ బిల్లును తీసుకురానున్నామని చెప్పారు. రాష్ట్రంలో న్యాయమైన సాంకేతిక విద్యను అందించేందుకే ప్రైవేటు వర్సిటీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News