: మగ రైనోకు సాయుధ బాడీగార్డ్స్ కాపలా!


వాతావరణ మార్పుల వల్ల పెను ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్, మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎన్నో రకాల జంతుజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఈ కోవలోకి 'నార్తర్న్ వైట్ రైనోస్' కూడా వస్తాయి. ఈ జంతు జాతి ప్రపంచం నుంచి కనుమరుగయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే, ఈ జాతికి చెందిన రైనోస్ కేవలం మూడే మూడు బతికి ఉన్నాయి. ఒకటి మగది కాగా, రెండు ఆడవి. దీంతో మగ రైనోతో ఆడ రైనోలను స్నేహం చేయించి, వీటి జాతిని ఉద్ధరించాలని కెన్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మగ రైనోకు ఎలాంటి కష్టం, నష్టం కలుగకుండా సాయుధ బలగాన్ని కేటాయించింది. దాని మీద ఈగ కూడా వాలకుండా కాపలా కాయాలని ఆదేశించింది. దీంతో దాని చుట్టూ సాయుధులైన సైనికులు కాపలా కాస్తున్నారు. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. వయసు మీద పడిన మగ రైనోకు జరగరానిది ఏదన్నా జరిగితే ఈ జాతి అంతరించిపోతుందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ లోగా ఆడరైనోలతో సంపర్కం చేయించాలని చూస్తున్నారు. వీరి ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

  • Loading...

More Telugu News