: గాంధీల ప్రయాణాలపై షరతులు విధించాలని కోర్టును ఎందుకు కోరానంటే...: సుబ్రహ్మణ్యస్వామి


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. వారికి, వారితో పాటు మరో ముగ్గురు నిందితులకు కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే, విచారణ సందర్భంగా, గాంధీల ప్రయాణాలపై షరతులు విధించాలని కోర్టుకు బీజేపీ నేత, పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి విన్నవించారు. అయితే, ఆయన విన్నపాన్ని కోర్టు సున్నితంగా తిరస్కరించింది. కోర్టు తీర్పు అనంతరం వెలుపలకు వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడారు. గాంధీల ప్రయాణాలపై షరతులు విధించాలని కోర్టును తానెందుకు కోరారో వివరణ ఇచ్చారు. "గాంధీలకు ఉన్నట్టుండి మాయమవడం అలవాటు. కొన్నిసార్లు నోటీసు కూడ ఇవ్వకుండా 57 రోజులు మాయం కాగలరు" అని స్వామి అన్నారు. ఈ మధ్య చెప్పాపెట్టకుండా రాహుల్ గాంధీ ఎక్కడకో వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే సుబ్రహ్మణ్యస్వామి కోర్టుకు తన వాదన వినిపించారు.

  • Loading...

More Telugu News